
ఐపీఎల్ లో మంగళవారం (మార్చి 25) మరో ఆసక్తి సమరం ప్రారంభమైంది. ఆతిధ్య గుజరాత్ టైటాన్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మంచు ప్రభావం కారణంగా బౌలింగ్ తీసుకున్నట్టు గుజరాత్ కెప్టెన్ గిల్ అన్నాడు. ఈ సీజన్ లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఇప్పటికే 8 జట్లు తమ తొలి మ్యాచ్ ను ఆడేశాయి.
గుజరాత్ నాలుగు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఈ మ్యాచ్ ఆడుతుంది. పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు.. ఒక స్పిన్నర్ ఉన్నారు. ఫారెన్ ప్లేయర్ల విషయానికి వస్తే గుజరాత్ బట్లర్, రబడా, గ్లెన్ ఫిలిప్స్, రషీద్ ఖాన్ లతో బరిలోకి దిగుతుంది. మరోవైపు పంజాబ్ స్టోయినీస్, మ్యాక్స్ వెల్, అజమాతుల్లా ఓమర్జాయ్, మార్కో జాన్సెన్ లు తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):
శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్జ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్