బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వర్షం తగ్గిపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు.
ఈ మ్యాచ్ లో గుజరాత్‌పై బెంగళూరు విజయం సాధించాలి. అప్పుడు 16 పాయింట్లతో మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇక ఇప్పటికే గుజరాత్ ప్లేఆఫ్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో బెంగళూరు జట్టుకు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది.
గుజరాత్ జట్టు : గిల్, సాహా, హార్దిక్ పాండ్య (కెప్టెన్), మిల్లర్, శనక, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, షమి, యశ్ దయాల్
బెంగళూరు జట్టు : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), బ్రాస్‌వెల్, మ్యాక్స్‌వెల్, మహిపాల్ లామ్రోర్, అనుజ్ రావత్, దినేశ్ కార్తిక్, హర్షల్ పటేల్, పార్నెల్, సిరాజ్, విజయ్‌కుమార్ వైశాఖ్