GT vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. మార్పులు లేకుండానే ఇరు జట్లు

GT vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. మార్పులు లేకుండానే ఇరు జట్లు

ఐపీఎల్ 2025 లో శనివారం (ఏప్రిల్ 19) అభిమానులని అలరించడానికి రెండు మ్యాచ్ లు రెడీగా ఉన్నాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నం తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ లో తలపడనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

ఇప్పటివరకు ఢిల్లీ ఆడిన ఆరు మ్యాచ్ ల్లో ఐదు మ్యాచ్ ల్లో గెలిచి టేబుల్ టాపర్ గా కొనసాగుతుంది. మరోవైపు గుజరాత్ ఆడిన ఆరు మ్యాచ్ ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఏ జట్టు గెలిచినా ప్లే ఆఫ్ రేస్ లో ముందుంటుంది. రెండు జట్లు ప్లేయింగ్ 11 లో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి.  

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): 

సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ