
ఐపీఎల్ లో మరో ఆసక్తికర సమరం మొదలైంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇరు జట్లకు ఇది మూడో మ్యాచ్. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఘన విజయం సాధించింది. మరోవైపు గుజరాత్ రెండు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచింది.
వ్యక్తిగత కారణాల వలన సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండడం లేదు. అర్షద్ ఖాన్ ఫాస్ట్ బౌలర్ గా గుజరాత్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు బెంగళూరు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):
ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):
సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ