IPL 2025: ప్లేయర్ కోచ్‌గా మారిన వేళ: గుజరాత్ అసిస్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్

IPL 2025: ప్లేయర్ కోచ్‌గా మారిన వేళ: గుజరాత్ అసిస్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్

ఐపీఎల్ 2025 కు ముందు గుజరాత్ టైటాన్స్ కొత్త అసిస్టెంట్ కోచ్‌ని ప్రకటించింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ వేడ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 2022, 2024లో గుజరాత్ ఫ్రాంచైజీ తరపున ప్లేయర్ గా ఆడిన వేడ్‌.. ఇప్పుడు కోచ్ అవతారంలో కనిపించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఈ ఆసీస్ క్రికెటర్ తొలిసారి కోచింగ్ పదవిలో అడుగుపెడుతున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో వేడ్‌ను ఎవరూ కొనలేదు. దీంతో అతను కోచింగ్ పదవిలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. 

ALSO READ | IND vs NZ Final: ఫైనల్ మ్యాచ్‌కు నో ఛాన్స్.. కన్నీళ్లు పెట్టుకున్న కివీస్ ఫాస్ట్ బౌలర్

వేడ్‌ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా, బ్యాటింగ్ కోచ్ పార్థివ్ పటేల్, అసిస్టెంట్ కోచ్‌లు ఆశిష్ కపూర్, నరేందర్ నేగితో సహా ఇతర కోచింగ్ సిబ్బంది సభ్యులతో కలిసి పని చేయనున్నాడు. ఇటీవలే ముగిసిన బిగ్ బాష్ లీగ్ లో ఈ ఆసీస్ వికెట్ కీపర్ హోబర్ట్ హరికేన్స్‌ తరపున ఆడాడు. ప్రస్తుతం అతను కోచింగ్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. గుజరాత్  తరపున వేడ్‌ మొత్తం 12 మ్యాచ్‌లు ఆడాడు. 2022 లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న జట్టులో సభ్యుడు. 

2025 లో ఐపీఎల్ గుజరాత్ టైటాన్స్ జట్టు:
 
2022లో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చింది. తొలి ప్రయత్నంలోనే అన్ని జట్లకు షాక్ ఇచ్చి హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో టైటిల్ గెలుచుకుంది. 2023లో ఫైనల్ కు చేరినా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. గత ఏడాది కనీసం క్వాలిఫయర్స్ కు చేరుకోవడంలో విఫలమైంది. 2025 గుజరాత్ టైటాన్స్ జట్టు విషయానికి టీమిండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ కెప్టెన్ గా జట్టును నడిపించనున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ఇంగ్లాండ్ వైట్-బాల్ కెప్టెన్ జోస్ బట్లర్, సౌతాఫ్రికా ఫాస్ట్ర బౌలర్ రబడా, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆ జట్టులో కీలక ఆటగాళ్లు.