LSG vs GT: గిల్, సుదర్శన్ మెరుపులు.. లక్నో ముందు ఛాలెంజింగ్ టార్గెట్!

LSG vs GT: గిల్, సుదర్శన్ మెరుపులు.. లక్నో ముందు ఛాలెంజింగ్ టార్గెట్!

ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ మరోసారి భారీ స్కోర్ చేసింది. శనివారం లక్నో సూపర్ జయింట్స్ పై జరుగుతున్న మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభమాన్ గిల్ (38 బంతుల్లో 60: 6 ఫోర్లు, సిక్సర్)  సాయి సుదర్శన్ (37 బంతుల్లో 56: 7 ఫోర్లు, సిక్సర్) హాఫ్ సెంచరీలతో జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. లక్నో బౌలర్లలో శార్దూల్, రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. దిగ్వేశ్, ఆవేశ్ ఖాన్ లకు తలో వికెట్ దక్కింది.   

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు శుభమాన్ గిల్, సాయి సుదర్శన్ చక్కని ఆట తీరు ప్రదర్శించారు. జాగ్రత్తగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. దీంతో పవర్ ప్లే లో వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత కూడా ఇద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. గేర్ మార్చి ఇన్నింగ్స్ వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో గిల్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో సాయి సుదర్శన్ 32 బంతుల్లోనే తన ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 

►ALSO READ | IPL 2025: వరల్డ్ క్లాస్ ఫినిషర్.. రెండు సీజన్‌లలో ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఇంటికి

తొలి వికెట్ కు 12 ఓవర్లలోనే 120 పరుగులు జోడించిన తర్వాత భారీ షాట్ కు ప్రయత్నించి గిల్ ఔటయ్యాడు. గిల్ ఔట్ కావడంతో లక్నో బౌలర్లు పట్టు బిగించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తూ పరుగులు రానివ్వలేదు. దీంతో సాయి సుదర్శన్ తో పాటు సుందర్(4), బట్లర్(16) కూడా వెంటనే ఔటయ్యాడు. రూథర్ ఫోర్డ్(22), షారుఖ్ ఖాన్(11) చివర్లో హిట్టింగ్ చేయడంతో జట్టు స్కోర్ 180 మార్క్ కు చేరుకుంది.