GT vs RR: బ్యాటింగ్‌లో దంచికొట్టిన గుజరాత్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..?

GT vs RR: బ్యాటింగ్‌లో దంచికొట్టిన గుజరాత్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..?

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ లో అదరగొట్టింది. మొదట బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి ముందు భారీ స్కోర్ ఉంచింది. ఓపెనర్ సాయి సుదర్శన్(53 బంతుల్లో 82: 8 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ హాఫ్ సెంచరీకి తోడు బట్లర్ (36), షారుఖ్ ఖాన్ (36) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 82 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే, తీక్షణ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు.      

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆర్చర్ వేసిన ఒక పవర్ ఫుల్ డెలివరీకి గిల్ (2) బౌల్డయ్యాడు. ఈ దశలో సాయి సుదర్శన్ కు జత కలిసిన బట్లర్ ఇన్నింగ్స్ ను ముందు తీసుకెళ్లాడు. పవర్ ప్లే లో బట్లర్ నెమ్మదిగా ఆడితే సుదర్శన్ చెలరేగాడు. దీంతో తొలి 6 ఓవర్లలో గుజరాత్ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత బట్లర్ గేర్ మార్చాడు. కొన్ని బౌండరీలతో స్కోర్ బోర్డును శరవేగంగా ముందుకు నడిపాడు.

►ALSO READ | IPL 2025: ఐపీఎల్ 2025.. జియో హాట్ స్టార్‌లో ఎక్కువగా చూసిన మ్యాచ్ లు ఇవే!

జోరు కొనసాగిస్తున్న సమయంలో తీక్షణ బట్లర్ ను ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు షారుఖ్ ఖాన్ (36) తనని తాను నిరూపించుకున్నాడు. సుదర్శన్ తో కలిసి హిట్టింగ్ చేస్తూ మంచి క్యామియో ఆడి వెళ్ళాడు. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో సాయి సుదర్శన్ దాదాపు ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు. 82 పరుగులు చేసి 19 ఓవర్ లో ఔటయ్యాడు. చివర్లో రషీద్ ఖాన్ (4 బంతుల్లో 12), టివాటియా (12 బంతుల్లో 24) మెరుపులు మెరిపించడంతో స్కోర్ 200 పరుగులు దాటింది.