హ్మదాబాద్: ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జూలు విదిల్చింది. వరుస పరాజయాలకు చెక్ పెడుతూ గుజరాత్ టైటాన్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో శశాంక్ సింగ్ (29 బాల్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61*), అశుతోష్ శర్మ (17 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 31) సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో.. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గుజరాత్‌కు చెక్ పెట్టింది. టాస్ ఓడిన గుజరాత్ 20 ఓవర్లలో 199/4 స్కోరు చేసింది. శుభ్‌మన్ గిల్ (48 బాల్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 89*), సాయి సుదర్శన్ (19 బాల్స్‌లో 6 ఫోర్లు 33) రాణించారు. తర్వాత పంజాబ్ 19.5 ఓవర్లలో 200/7 స్కోరు చేసి నెగ్గింది. ప్రభుసిమ్రన్ (35) ఆకట్టుకున్నాడు. శశాంక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
గిల్ జిగేల్..
గుజరాత్‌కు గిల్ మంచి ఆరంభాన్నిచ్చాడు. కానీ మూడో ఓవర్‌లో రబాడ (2/44) దెబ్బకు సాహా (11) ఔట్‌కావడంతో జీటీ 29 రన్స్‌కు ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఈ దశలో విలియమ్సన్ (26) ఫోర్లతో అలరించాడు. దీంతో పవర్‌ప్లేలో గుజరాత్ 52/1 స్కోరుతో నిలిచింది. ఇక్కడి నుంచి గిల్, కేన్ స్ట్రయిక్ రొటేట్ చేసి రెండో వికెట్‌కు 40 రన్స్ జత చేశారు. కానీ 9వ ఓవర్‌లో విలియమ్సన్ వెనుదిరిగాడు. గిల్‌తో కలిసిన సాయి సుదర్శన్ మెరుగ్గా ఆడటంతో ఫస్ట్ టెన్‌లో జీటీ 83/2 స్కోరు చేసింది. 12వ ఓవర్‌లో సాయి మూడు ఫోర్లతో 14 రన్స్ కొట్టి టచ్‌లోకి వచ్చాడు. తర్వాతి ఓవర్‌లో గిల్ సిక్స్, సాయి ఫోర్‌తో జోరు పెంచారు. కానీ 14వ ఓవర్‌లో హర్షల్ (1/44) స్లో బాల్‌ను కట్ చేయబోయిన సాయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. మూడో వికెట్‌కు 53 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయ్యింది. 31 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన గిల్ 6, 6, 4తో రెచ్చిపోయాడు. 18వ ఓవర్‌లో విజయ్ శంకర్ (8) ఔటైనా ఫోర్త్ వికెట్‌కు 42 రన్స్ జతయ్యాయి. చివర్లో రాహుల్ తెవాటియా (23*) ఐదో వికెట్‌కు 35 రన్స్ జత చేశాడు.
ఆఖర్లో అద్భుతం..
ఛేజింగ్‌లో పంజాబ్‌ను గుజరాత్ బౌలర్లు కట్టడి చేసినా.. ఆఖర్లో కింగ్స్ బ్యాటర్లు అద్భుతం చేశారు. రెండో ఓవర్‌లోనే ధవన్ (1)ను ఔట్ చేయగా, తర్వాత నూర్ అహ్మద్ (2/32) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. బెయిర్‌స్టో (22)ను 6వ ఓవర్‌లో ఔట్ చేసిన నూర్.. 8వ ఓవర్‌లో ప్రభుసిమ్రన్ వికెట్ తీశాడు. 9వ ఓవర్‌లో ఒమర్‌జాయ్ (1/41) దెబ్బకు సామ్ కరన్ (5) వెనుదిరిగాడు. బెయిర్‌స్టో, ప్రభుసిమ్రన్ రెండో వికెట్‌కు 35 రన్స్ జోడించడంతో పవర్‌ప్లేలో 54/2తో ఉన్న స్కోరు ఫస్ట్ టెన్‌లో 83/4కి పెరిగింది. ఈ టైమ్‌లో శశాంక్ సింగ్ మెరుగ్గా ఆడినా, సికిందర్ రజా (15), జితేశ్ శర్మ (16) ఫెయిలయ్యారు. ఐదో వికెట్‌కు 41 రన్స్ జోడించి 13వ ఓవర్‌లో రజా, ఆరో వికెట్‌కు 39 రన్స్ జత చేసి 16వ ఓవర్‌లో జితేశ్ పెవిలియన్‌కు చేరడంతో గుజరాత్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. చివరి 4 ఓవర్లలో 47 రన్స్ అవసరం కాగా, అషుతోష్ 4,4,4,6తో రెచ్చిపోయాడు. ఆఖరి ఓవర్‌లో 7 రన్స్ కావాల్సిన దశలో ధర్మన్ (1/6).. అశుతోష్‌ను ఔట్ చేయడంతో ఉత్కంఠ మొదలైంది. కానీ శశాంక్ ఫోర్‌తో గెలిపించాడు.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లలో 199/4 (గిల్ 89*, సుదర్శన్ 33, రబాడ 2/44). పంజాబ్: 19.5 ఓవర్లలో 200/7 (శశాంక్ 61*, ప్రభుసిమ్రన్ 35, నూర్ అహ్మద్ 2/32).