గుజరాత్ vs హైదరాబాద్.. గెలుపెవరిది.?

గుజరాత్  vs  హైదరాబాద్.. గెలుపెవరిది.?

ఐపీఎల్ లో  ఇవాళ మరో హాట్ ఫేవరేట్ మ్యాచ్ జరగబోతుంది. అహ్మదాబాద్ గ్రౌండ్ లో  సన్ రైజర్స్, హైదరాబాద్ మధ్య మ్యాచ్ తలపడనున్నాయి.   మధ్యామ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.  ఈ సీజన్ లో ఇరు జట్లకు ఇది మూడో మ్యాచ్. 

ఈ సీజన్ లో ఇరు జట్లు   ఇప్పటికే 2 మ్యాచులు ఆడి ఒకటి ఓడిపోయాయి.  కాకపోతే రన్ రేటు పరంగా పాయింట్ల టేబులో నాలుగో స్థానంలో ఉండగా..గుజరాత్ 8వ స్థానంలో ఉంది. ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ లోనే అత్యధిక స్కోరు 277 చేసిన హైదరాబాద్ జోరు మీద ఉంది. గుజరాత్ పై  కూడా అదే ఊపు కొనసాగించాలని చూస్తోంది.

జోరుమీదున్న సన్ రైజర్స్ 

 హైదరాబాద్ బ్యాటర్లలో  హెన్రిచ్ క్లాసెస్ చెలరేగి ఆడుతున్నాడు. కేకే ఆర్ పై 29 బంతుల్లో63 పరుగులు చేసిన ఇతను.. ముంబైపై 34 బంతుల్లో 80 పరుగులు చేశాడు.  అలాగే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్ రమ్ బ్యాటింగ్ లైనప్ బాగుంది. బౌలర్లలో ఫ్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్ తమ సత్తా చాటాల్సి ఉంది.   

ఇక గుజరాత్ టైటాన్స్ శుభ్ మన్ గిల్ పైనే ఆశలు పెట్టుకుంది. ఓపెనర్లు గిల్,  వృద్ధిమాన్ సాహా, విజయ్ శంకర్,డేవిడ్ మిల్లర్  ఓమర్జాయి  రాహుల్ తెహవాటియా లాంటి  ఆటగాళ్లు ఉన్నప్పటికీ  ఏ ఒక్కరు కూడా కీలక ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు.

జట్లు(అంచనా)

గుజరాత్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్. 

హైదరాబాద్: ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, T నటరాజన్/జైదేవ్ ఉనద్కత్.