ఐపీఎల్ లో భాగంగా మే 16 న సన్ రైజర్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ప్లే ఆఫ్ రేస్ లో సన్ రైజర్స్ ముందు వరుసలో ఉంటే.. గుజరాత్ వెనకపడింది. ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకోవాలని కమ్మిన్స్ సేన భావిస్తుంటే.. గెలిచి ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలని గుజరాత్ భావిస్తుంది.
ఈ మ్యాచ్‌లో గిల్ సేన సరికొత్త జెర్సీలో మైదానంలోకి దిగబోతుంది. ప్రస్తుతం గుజరాత్ కొత్త జెర్సీ క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. క్యాన్సర్ రోగులను ఆదుకునేందుకు ఇది తమ ప్రత్యేక ప్రచారమని తెలుస్తుంది. లావెండర్ రంగు జెర్సీలో గుజరాత్ ఆటగాళ్లు నేడు మ్యాచ్ ఆడబోతున్నారు. లావెండర్ సాధారణంగా అన్నవాహిక క్యాన్సర్‌కు రంగు. కానీ ఇప్పుడు ఇది అన్ని రకాల క్యాన్సర్‌లకు ఉపయోగిస్తున్నారు.
లావెండర్ జెర్సీని ధరించి గతంలో ఢిల్లీ డేర్‌డేవిల్స్ జట్టు కూడా ఆడింది. 2015 సీజన్‌లో మాజీ భారత స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నేతృత్వంలో ఈ జెర్సీలో మ్యాచ్ ఆడింది. స్వయంగా క్యాన్సర్‌ను జయించిన యువరాజ్ సింగ్ చొరవతో ఢిల్లీ జట్టు లావెండర్ జెర్సీ ధరించి క్యాన్సర్‌పై ప్రచారం నిర్వహించింది. లీగ్ దశలో హోమ్ గ్రౌండ్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న గుజరాత్ టైటాన్స్.. సరికొత్త జెర్సీలో మెరిసింది.
GT to don lavender jersey against KKR to support cancer awareness! pic.twitter.com/vuqD4BDZ61
— CRICKETNMORE (@cricketnmore) May 9, 2024