IPL 2024: గిల్ సేనకు భారీ ఎదురు దెబ్బ.. గుజరాత్ మ్యాచ్ విన్నర్‌కు గాయం

ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కష్టాలు ఎక్కువవుతున్నాయి. హార్దిక్ పాండ్య ముంబై గూటికి చేరితే.. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి తప్పుకున్నాడు. తాజాగా ఆ జట్టు మ్యాచ్ విన్నర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ గాయం గుజరాత్ ను కలవరపెడుతుంది. నిన్న (ఏప్రిల్ 4) పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మిల్లర్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. గాయం కారణంగా మిల్లర్ స్థానంలో విలియంసన్ కు ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. 

పంజాబ్ తో మ్యాచ్ సందర్భంగా టాస్ సమయంలో  కెప్టెన్ గిల్ మాట్లాడుతూ..ఈ మ్యాచ్ కు గాయం కారణంగా మిల్లర్ ఆడటం లేదని చెప్పాడు. అయితే అతని గాయం తీవ్రత గురించి చెప్పలేదు. ప్రస్తుతం ఈ సఫారీ ఆటగాడి గాయం తీవ్రంగా ఉందని.. అతనికి ఒకటి లేదా రెండు మ్యాచ్ లు రెస్ట్ అవసరమని మ్యాచ్ తర్వాత విలియంసన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మిల్లర్ 27 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. కొన్ని సీజన్ లుగా నిలకడగా రాణిస్తున్న మిల్లర్ లేకపోవడంతో గుజరాత్ టైటాన్స్ కు భారీ ఎదురు దెబ్బ తగలనుంది. 

ALSO READ :- SRH vs CSK: చెన్నై vs సన్ రైజర్స్.. గెలిచే జట్టేది..?

మిల్లర్ లేకపోవడంతో ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది.శశాంక్ సింగ్‌‌ (29 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 61*), అశుతోష్‌‌ శర్మ (17 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 31) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. టాస్‌‌ ఓడిన గుజరాత్‌‌ 20 ఓవర్లలో 199/4 స్కోరు చేసింది. శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (48 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 89*), సాయి సుదర్శన్‌‌ (19 బాల్స్‌‌లో 6 ఫోర్లు 33) రాణించారు. తర్వాత పంజాబ్‌‌ 19.5 ఓవర్లలో 200/7 స్కోరు చేసి నెగ్గింది. ప్రభుసిమ్రన్‌‌ (35) ఆకట్టుకున్నాడు. శశాంక్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.