
ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ మరో కీలక విజయాన్ని నమోదు చేసుకుంది. సొంతగడ్డపై టేబుల్ టాపర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించింది. శనివారం (ఏప్రిల్ 19) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. భారీ ఛేజింగ్ లో జోస్ బట్లర్ (54 బంతుల్లో 97: 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ కు తోడు రూథర్ ఫోర్డ్ (43), సాయి సుదర్శన్ (36) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ 19.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసి గెలిచింది.
204 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. రెండో ఓవర్ లో కరుణ్ నాయర్ వేసిన అద్భుత త్రో కారణంగా కెప్టెన్ శుభమాన్ గిల్ (7) ఔటయ్యాడు. ఈ దశలో కెప్టెన్ బట్లర్, సాయి సుదర్శన్ గుజరాత్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఓ వైపు వికెట్ కాపాడుకుంటూనే మరోవైపు వేగంగా పరుగులు చేశారు. వీరిద్దరి ధాటికి పవర్ ప్లే లో గుజరాత్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది.
పవర్ ప్లే తర్వాత కుల్దీప్ యాదవ్ జోరు మీదున్న సాయి సుదర్శన్ (36) ను పెవిలియన్ కు పంపి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశాడు. అయితే బట్లర్, రూథర్ ఫోర్డ్ ఢిల్లీ బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. ఇద్దరూ భారీ షాట్లతో చెలరేగడంతో మ్యాచ్ గుజరాత్ వైపు మళ్లింది. స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 15 ఓవర్లో బట్లర్ వరుసగా ఐదు ఫోర్లు బాదడంతో మ్యాచ్ పూర్తిగా గుజరాత్ చేతుల్లోకి వచ్చింది. జట్టు విజయం కోసం చివరి వరకు క్రీజ్ లో ఉన్న బట్లర్ సెంచరీ చేసుకోలేకపోయాడు. చివరి ఓవర్లో 10 పరుగులు కావాల్సిన దశలో టివాటియా సిక్సర్, ఫోర్ కొట్టి మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్ లకు తలో వికెట్ దక్కింది.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ (32 బంతుల్లో 39: ఫోర్, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ కు తోడు మిగిలిన వారు సమిష్టిగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు భారీ స్కోర్ చేసింది. 39 పరుగులు చేసి అక్షర్ పటేల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, సాయి కిషోర్, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు.
#IPL2025 🏏: Gujarat Titans beat Delhi Capitals by 7 wickets.
— All India Radio News (@airnewsalerts) April 19, 2025
Final Score:
DC 203/8 (20 Overs)
GT 204/3 (19.2 Overs)
📍Narendra Modi Stadium, Ahmedabad#TATAIPL | #GTvsDC | #DCvsGT pic.twitter.com/7BEUMsqjIM