పదేళ్ల కన్న కొడుకును హత్య చేసిన ట్రాఫిక్ జవాన్

పదేళ్ల కన్న కొడుకును హత్య చేసిన ట్రాఫిక్ జవాన్

గుజరాత్‌ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ ట్రాఫిక్ బ్రిగేడ్ జవాన్ తన పదేళ్ల కుమారుడికి విషం ఇచ్చి గొంతుకోసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సంజయ్ బారియా(37) తన కుమారుడు వంశ్‌ను హత్య చేసి, మృతదేహాన్ని నవ్‌సారి నగరంలోని ట్రాఫిక్ చౌకీలోని యుటిలిటీ రూమ్‌లో పడేసినట్లు జూన్ 2వ తేదీ ఆదివారం పోలీసులు తెలిపారుఅధికారి తెలిపారు.

జూన్ 1 శనివారం  మధ్యాహ్నం 3.40 గంటల ప్రాంతంలో బరియా తన భార్యకు ఫోన్‌లో ఫోన్ చేసి తమ కొడుకు గురించి తెలియజేసినట్లు  నవ్‌సారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ-) సుశీల్ అగర్వాల్ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు.

నిందితుడు తమ కొడుకును మే 31వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం పనికి తీసుకెళ్లాడని, మరుసటి రోజు ఫోన్‌లో అతనిని సంప్రదించడానికి ప్రయత్నించాగా.. ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు వచ్చిందని బరియా భార్య రేఖ తన ఫిర్యాదులో తెలిపింది.

తరువాత, బరియా వదిలేసిన మోటార్ సైకిల్ నగరంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే తండ్రీ కొడుకుల ఆనవాళ్లు కనిపించలేదని చెప్పారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) ప్రకారం నిందితుడు శనివారం మధ్యాహ్నం తన భార్యకు ఫోన్ చేసి యుటిలిటీ రూమ్‌లో పడి ఉన్న కొడుకు మృతదేహం గురించి తెలియజేశాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది.. వారు వెళ్లి తనిఖీ చేయగా.. బాలుడి నోటిలో నురగ వచ్చి, మెడలో నైలాన్ తాడు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రిక తరలించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్పీ అగర్వాల్ తెలిపారు.