ఎవరైనా మనుషులు చనిపోతే ఖననం చేస్తాం..లేదా దహనం చేస్తాం.. ఘనంగా వీడ్కోలు చెబుతాం..ఇంకొందరు మనుషులకే కాదు.. పెంపుడు జంతువులైన కుక్కలు, ఎద్దులువంటి వాటికి అంత్యక్రియలు చేయడం మనం చూస్తున్నాం. ఇటీవల ఓ వ్యక్తి తన ఎద్దు చనిపోతే అంతిమ సంస్కారాలుచేశారు.. ఇంకోచోట వానరం చనిపోతే కూడా అంత్యక్రియలు నిర్వహించడం చూశాం..అయితే ఎక్కడైనా కారుకు అంత్యక్రియలు చేయడం చూశారా.. గుజరాత్ లో ఓ ఫ్యామిలి వారికి ఇష్టమైన కారును సమాధి చేసి ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
గుజరాత్ లో ఓ ఫ్యామిలీ..వారికి ఇష్టమైన కారుకు సమాధి కార్యక్రమం నిర్వహించి అంతిమ సంస్కారాలు చేశారు. సమాధి కార్యక్రమానికి రావాలని బంధువులను ఆహ్వానించారు. నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేశారు.. ఈ కార్యక్రమానికి దాదాపు 15 వందల మంది వచ్చారు.
సమాధి కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. కారును అందంగా అలంకరించారు. ఓ మనిషి చనిపోతే సమాధి చేసే ముందు ఎలా ముస్తాబు చేస్తారో అలా శుభ్రంగా కడిగి, రకరకాల పూలతో అలంకరించారు. కారును కొత్త బట్టతో చుట్టి చివరికి సమాధి చేశారు. అనంతరం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశారు.
మారుతి సుజుకీ వాగ్నర్.. గుజరాత్ కు చెందిన ఆ ఫ్యామిలి 12యేండ్ల క్రితం ఇష్టపడి కొనుగోలు చేసింది. అప్పటినుంచి వారికి కలిసొచ్చింది..ముద్దుగా లక్కీ అని పిలు చుకుంటున్నారు.అయితే లక్కీ ఇటీవల కాలంలో సేవలందించలేకపోయింది.. దీంతో ఆ కుటుంబం లక్కీని వదులులేక.. ఇతరులకు ఇచ్చే ప్రయత్నంగానీ, అమ్మే ప్రయత్నంగానీ చేయలేదు.
ALSO READ : పట్టాల మధ్యలో బైక్.. వందే భారత్ ట్రైన్‌కు తప్పిన పెను ప్రమాదం
అయితే ఆ కుటుంబ పెద్ద సలహా మేరకు లక్కీని సమాధి చేసేందుకు సిద్దమయ్యారు. తమకు ఇష్టమైన, లక్కీ కారు అయిన ఈ మారుతి సుజుకీ వాగ్నర్ కు గ్రాండ్ వీడ్కోలు చెప్పారు. బంధువులు, స్నేహితులు, వచ్చారు.
ఇప్పటివరకు ఇలాంటి విచిత్ర సంఘటన ఎక్కడా జరగలేదు..ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్ర మానికి 15 మంది హాజరయ్యారంటే.. ఏ రేంజ్ సమాధి కార్యక్రమం జరిగిందో అర్థం చేసుకోవాలి. లక్కీ కారు మారుతి వాగ్నర్ సమాధి కార్యక్రమంలో 2024లో ఉత్తమ అనుకోని సంఘటనగా రికార్డును సృష్టించిందని చెప్పాలి.