
అహ్మదాబాద్: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్–18లో వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. ఓపెనర్ సాయి సుదర్శన్ (53 బాల్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) మరో సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో జీటీ 58 రన్స్ తేడాతో రాజస్తాన్ రాయల్స్‌కు చెక్ పెట్టింది. తొలుత టాస్ ఓడిన గుజరాత్ 20 ఓవర్లలో 217/6 స్కోరు చేసింది. సుదర్శన్‌కు తోడు బట్లర్ (36), షారూక్ ఖాన్ (36) రాణించారు.
తర్వాత ఛేజింగ్‌లో రాజస్తాన్ 19.2 ఓవర్లలో159 రన్స్‌కు ఆలౌటైంది. హెట్‌మయర్ (32 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52), శాంసన్ (28 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) పోరాటం వృథా అయ్యింది. ప్రసిధ్ కృష్ణ (3/24) మూడు వికెట్లతో రాయల్స్‌ను దెబ్బకొట్టాడు. సుదర్శన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
కీలక భాగస్వామ్యాలు..
మొదట బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్‌కు ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే ఆర్చర్ (1/30).. గిల్ (2)ను ఔట్ చేసి షాకిచ్చినా సాయి సుదర్శన్ చివరి వరకు నిలబడి మంచి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. మధ్యలో బట్లర్, షారూక్ ఖాన్ అతనికి సపోర్ట్ ఇచ్చారు. ఆరంభంలో బట్లర్ ఫోర్‌తో గాడిలో పడితే సుదర్శన్ 6, 6, 4, 4తో హిట్టింగ్ షురూ చేశాడు. ఆరో ఓవర్‌లో ఏడు రన్సే రావడంతో పవర్‌ప్లేలో జీటీ 56/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత బట్లర్ ఓవర్‌కు రెండు బౌండ్రీలతో దూకుడు పెంచినా పదో ఓవర్‌లో లాస్ట్ బాల్‌కు మహేశ్ తీక్షణ (2/54)కు ఎల్బీ రూపంలో వికెట్ ఇచ్చాడు.
నాలుగు ఓవర్లలో 35 రన్స్ రావడంతో సగం ఓవర్లలో జీటీ స్కోరు 94/2కు పెరిగింది. సుదర్శన్ 32 బాల్స్‌లో ఫిఫ్టీ కొట్టగా, రెండో వికెట్‌కు 80 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఈ దశలో వచ్చిన షారూక్ భారీ హిట్టింగ్‌కు తెరలేపాడు. ఆరంభంలో సింగిల్స్ తీసినా 12వ ఓవర్‌లో రెండు ఫోర్లతో జోరు చూపెట్టాడు. 13వ ఓవర్‌లో 4, 6తో 14 రన్స్ రాబట్టిన అతను 14వ ఓవర్‌లో వరుసగా 6, 4, 4తో 16 రన్స్ దంచాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి జీటీ 145/2తో నిలిచింది. అయితే 16వ ఓవర్ తీక్షణ వేసిన వైడ్ బాల్‌ను షాట్ ఆడబోయిన షారుక్ స్టంపౌటయ్యాడు.
మూడో వికెట్‌కు 62 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. సిక్స్‌తో ఖాతా తెరిచిన రూథర్‌ఫోర్డ్ (7) మరో రెండు బాల్స్ ఆడి 17వ ఓవర్‌లో సందీప్ (1/41)కు వికెట్ ఇచ్చాడు. ఇదే ఓవర్‌లో 4, 6 కొట్టిన సుదర్శన్ 19వ ఓవర్‌లో వెనుదిరిగినా మధ్యలో రాహుల్ తెవాటియా (24 నాటౌట్) 6, 4, 6, 4తో చెలరేగాడు. ఐదో వికెట్‌కు 24 రన్స్ వచ్చాయి. చివర్లో రషీద్ ఖాన్ (12) సిక్స్, ఫోర్ కొట్టి ఔటయ్యాడు. చివరి ఐదు ఓవర్లలో 72 రన్స్ రావడంతో జీటీ భారీ టార్గెట్ నిర్దేశించింది.
బౌలర్లు అదుర్స్
భారీ ఛేజింగ్‌లో రాజస్తాన్‌ను జీటీ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. రెండో ఓవర్‌లో యశస్వి జైస్వాల్ (6)ను అర్షద్ ఖాన్ (1/19), తర్వాతి ఓవర్‌లో నితీష్ రాణా (1).. సిరాజ్ (1/30) ఔట్ చేయడంతో రాయల్స్ 12/2తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో శాంసన్, రియాన్ పరాగ్ (26) నెమ్మదిగా ఆడుతూ 57/2తో పవర్‌ప్లేను ముగించారు. కానీ ఏడో ఓవర్‌లో ఇంపాక్ట్‌గా వచ్చిన కుల్వంత్ (1/29).. పరాగ్‌ను వెనక్కి పంపి మూడో వికెట్‌కు 48 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు.
తర్వాతి ఓవర్‌లో రషీద్ (2/37) దెబ్బకు ధ్రువ్ జురెల్ (5) పెవిలియన్‌కు చేరడంతో రాజస్తాన్ 68/4తో కష్టాల్లో పడింది. శాంసన్‌తో కలిసి హెట్‌మయర్ నిలకడగా ఆడటంతో ఫస్ట్ టెన్‌లో రాయల్స్ 85/4 స్కోరు చేసింది. అప్పటి వరకు నిలకడగా ఆడిన శాంసన్ 13వ ఓవర్‌లో లైన్ తప్పాడు. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో సాయి కిశోర్ (2/20)కు క్యాచ్ ఇవ్వడంతో ఐదో వికెట్‌కు 48 రన్స్ ముగిశాయి.
ఏడు బాల్స్ తేడాలో శుభమ్ దూబే (1) ఔట్‌కావడంతో 119/6గా మారింది. ఆర్చర్ (4) నెమ్మదిగా ఆడినా హెట్‌మయర్ 4, 6, 4తో 29 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ16వ ఓవర్‌లో నాలుగు బాల్స్ తేడాలో ఈ ఇద్దరూ ఔటయ్యారు. తర్వాతి ఓవర్‌లో దేశ్‌పాండే (3), కొద్దిసేపటికే తీక్షణ (5) వెనుదిరగడంతో రాజస్తాన్ పూర్తి ఓవర్లు ఆడలేకపోయింది.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లలో 217/6 (సాయి సుదర్శన్ 82, బట్లర్ 36, మహేశ్ తీక్షణ 2/54).
రాజస్తాన్: 19.2 ఓవర్లలో 159 ఆలౌట్ (హెట్‌మయర్ 52, శాంసన్ 41, ప్రసిధ్ కృష్ణ 3/24).