బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీని వడ్డీతో సహా చెల్లించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు, కేరళ ఇన్‌చార్జి గోలి మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పార్టీ జిల్లా ఆఫీసు ఎదుట నిర్వహించిన రైతు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడంతో పాటు ఉచితంగా ఎరువులు పంపిణీ చేయాలన్నారు. అన్ని రకాల వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందించాలని, యాసంగిలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
పీఎం ఫసల్ బీమాను రాష్ట్రంలో అమలు చేయలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, నాయకులు వీరెళ్లి చంద్రశేఖర్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, చేపూరి రవీందర్, నివేదితరెడ్డి, నాగం వర్షిత్‌రెడ్డి, పోతెపాక సాంబయ్య, అశోక్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, యాదగిరాచారి, నవీన్‌రెడ్డి, బీపంగి జగ్జీవన్, కొండా భవాని ప్రసాద్, ఐతరాజు సిద్దు, కంచర్ల విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు.