ఫిడే ర్యాంకింగ్స్‌లో గుకేశ్‌‌‌‌ @ 4

ఫిడే ర్యాంకింగ్స్‌లో గుకేశ్‌‌‌‌ @  4

న్యూఢిల్లీ : వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ డి. గుకేశ్‌‌‌‌.. ఫిడే ర్యాంకింగ్స్‌‌‌‌ను మెరుగుపర్చుకున్నాడు. గురువారం విడుదల చేసిన జాబితాలో గుకేశ్‌‌‌‌ 2784 రేటింగ్‌‌‌‌ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. దీంతో తెలంగాణ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ అర్జున్‌‌‌‌ ఎరిగైసి (2779.5) ఐదో ర్యాంక్‌‌‌‌కు పడిపోయాడు. టాటా స్టీల్‌‌‌‌ టోర్నీలో రెండో విజయాన్ని సాధించడంతో గుకేశ్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ మెరుగుపడింది. 

కార్ల్‌‌‌‌సన్‌‌‌‌ (నార్వే, 2832.5) టాప్‌‌‌‌లో ఉండగా, నకమురా (అమెరికా, 2802),  కరువాన (అమెరికా, 2798) వరుసగా రెండు, మూడు ర్యాంక్‌‌‌‌ల్లో కొనసాగుతున్నారు. లెజెండ్ విశ్వనాథన్‌‌‌‌ ఆనంద్‌‌‌‌ (2750), ఆర్‌‌‌‌. ప్రజ్ఞానంద (2741) వరుసగా 10, 13వ ర్యాంక్‌‌‌‌ల్లో ఉన్నారు.