
సింగపూర్ : ఇండియన్ గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్.. వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో మళ్లీ డ్రా నమోదు చేశాడు. శనివారం డింగ్ లిరెన్‌తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌నూ గుకేశ్ 40 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు. ఈ రౌండ్ తర్వాత ఇరువురి ఖాతాలో చెరో రెండున్నర పాయింట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో ఇది మూడో డ్రా కావడం విశేషం.
తెల్లపావులతో ఆడిన ఇండియన్ ప్లేయర్ కింగ్ పాన్ ఓపెనింగ్‌తో ముందుకొచ్చాడు. నల్ల పావులతో ఆడిన లిరెన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చకచకా ఎత్తులు వేస్తూ ఫ్రెంచ్ డిఫెన్స్‌తో నిలువరించాడు.