సింగపూర్ : వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఇండియా గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ ఆధిక్యాన్ని కోల్పోయాడు. 11వ రౌండ్లో ఓడిన డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) వెంటనే లెక్క సరి చేశాడు. సోమవారం జరిగిన 12వ రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన లిరెన్ 39 ఎత్తుల్లో గుకేశ్‌పై విజయం సాధించాడు. ఇంగ్లిష్ ఓపెనింగ్ గేమ్‌తో ఆటను ఆరంభించి తన ఎత్తులతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
గుకేశ్ బెనోయి డిఫెన్స్‌తో ఆడిన గుకేశ్ మిడిల్ గేమ్‌లో ప్రత్యర్థికి కౌంటర్ ఇవ్వలేకపోయాడు. దాంతో క్రమంగా ఆధిపత్యం చెలాయించిన లిరెన్ చివర్లో రూక్‌ను వదులుకొని గేమ్ నెగ్గాడు. మరో రెండు రౌండ్లు మిగిలున్న టోర్నీలో ఇద్దరు ప్లేయర్లు చెరో ఆరు పాయింట్లతో నిలిచారు. మంగళవారం ఆటకు విరామం. బుధ, గురువారాల్లో ఈ రెండు రౌండ్లు జరుగుతాయి.