
సింగపూర్ : వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ పోరును ఇండియా గ్రాండ్‌మాస్టర్ డి. గుకేశ్ ఓటమితో ఆరంభించాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన డిఫెండింగ్ చాంప్ డింగ్ లిరెన్ 42 ఎత్తుల్లో గుకేశ్‌ను ఓడించాడు. తెల్లపావులతో ఆడిన ఇండియా జీఎం మిడిల్ గేమ్‌లో అనవసర తప్పిదాలు చేసి పరాజయం పాలయ్యాడు. 14 రౌండ్ల మ్యాచ్‌లో మంగళవారం రెండో గేమ్ జరుగుతుంది.