చెన్నై గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో రన్నరప్‌‌‌‌‌‌‌‌గా అర్జున్‌‌‌‌‌‌‌‌

చెన్నై గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో రన్నరప్‌‌‌‌‌‌‌‌గా అర్జున్‌‌‌‌‌‌‌‌

చెన్నై: తెలంగాణ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ అర్జున్‌‌‌‌‌‌‌‌ ఎరిగైసి.. చెన్నై గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో రన్నరప్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. గురువారం ముగిసిన ఆ ఖరిదైన ఏడో రౌండ్‌‌‌‌‌‌‌‌లో అర్జున్‌‌‌‌‌‌‌‌.. సనన్‌‌‌‌‌‌‌‌ సుగిరోవ్‌‌‌‌‌‌‌‌ (హంగేరీ)పై గెలిచాడు. దీంతో 4.5 పాయింట్లతో గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ డి. గుకేశ్‌‌‌‌‌‌‌‌తో సమంగా నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్‌‌‌‌‌‌‌‌ స్కోరు ఆధారంగా గుకేశ్‌‌‌‌‌‌‌‌ను విన్నర్‌‌‌‌‌‌‌‌గా ప్రకటించారు. ఫలితంగా గుకేశ్‌‌‌‌‌‌‌‌ వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో పాల్గొనే అవకాశాలను మరింత మెరుగుపర్చుకున్నాడు. ఇక గుకేశ్‌‌‌‌‌‌‌‌తో జరిగిన ఆఖరి రౌండ్‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌ డ్రా చేసుకున్న పెంటేల హరికృష్ణ (4) మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు.