Video Viral: పిచ్చి పీక్​ స్టేజీకి చేరింది : గులాబ్​జామ్​ తో ఆమ్లెట్​ ఏంట్రా బాబూ..!

Video Viral: పిచ్చి పీక్​ స్టేజీకి చేరింది : గులాబ్​జామ్​ తో ఆమ్లెట్​ ఏంట్రా బాబూ..!

జనాలకు సోషల్​ మీడియా ఫోబియో పెరిగిపోయింది.  క్షణాల్లో ఫేమస్​ అయ్యేందుకు జనాలు..సోషల్​ మీడియాను ఉపయోగించుకుంటున్నారు.  ఇప్పుడు ఓ స్ట్రీట్​ ఫుడ్​ వ్యాపారి కొత్త రకమైన వంటకాన్ని కనిపెట్టాడు.  గులాబ్​జామ్​ తో ఆమ్లెట్​ తయారు చేసి  సోషల్​ మీడియాలో వైరల్ అయ్యాడు ఓ స్ట్రీట్​ ఫుడ్​ వ్యాపారి.

ఆమ్లెట్ చాలా మందికి ఇష్టమైన చిరుతిండి. అది చూడగానే తినాలి అనిపిస్తుంది.  ఆమ్లెట్ వాసన చూస్తే భలే ఉంటుంది. ఆమ్లెట్లు అనేక రకాలుగా తయారు చేసుకోవచ్చు. అయితే ఇంట్లో ఎక్కువగా ఆమ్లెట్‌ను గుడ్లు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వంటి ఇతర అవసరమైన పదార్థాలతో తయారు చేస్తారు.  ఇప్పుడు కొత్తరకమైన ఆమ్లెట్​ మార్కెట్​ లోకి వచ్చింది.

Also Read :  నో వైట్ డైట్ అంటే ఏంటీ.. 

గులాబ్ జామున్ ఆమ్లెట్ తయారీ వీడియోలో ఆమ్లెట్​ తయారు చేస్తూ గుడ్లను పగులకొట్టి పెనంపై ఉడికించాడు. ఆతరువాత వాటిపై తయారీగా ఉన్న గులాబ్​ జామ్​ ను ఉంచాడు. తరువాత టమాటా ముక్కలు.. కొత్తిమీర.. పచ్చిమిరపకాయలు వేసి కొంతసేపు వేగిన తరువాత దీనిని సర్వ్​ చేశాడు.  ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by shivam sharma (@chaska_food_ka)

ఈ వైరల్ వీడియోను  ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్ బ్లాగర్ శివం శర్మ తన అధికారిక ఖాతా 'chaska_food_ka'లో షేర్ చేశారు. ఈ వీడియోపై  సోషల్ మీడియా యూజర్లు స్పందించారు.  ఆన్​ లైన్​ ఫుడ్​ విక్రయ యాప్​ స్విగ్గీ కూడాస్పందించింది.   ఇట్నా భీ థిక్ థా, మాఫీ మిల్ జాతి, పర్ కెచప్..?!అంటూ ఫన్నీగా స్విగ్గీ పోస్ట్ చేసింది . ఒకరు గులాబ్​జామ్​ కు సరైన న్యాయం చేయండి అని రాశారు.   మరొక వినియోగదారు ... భాయ్...  కోకా-కోలా దాల్నా భూల్ గయే ఆప్ అని చమత్కారంగా రాశాడు.ఇంకొకరు ఈ అర్ధంలేని ఫుడ్​ తినడం వలన  చాలా మంది ఆసుపత్రులలో చేరుతున్నారంటూ రాసుకొచ్చారు.