ILT20: షర్ట్ విప్పి గిర్రున తిప్పాడు: గంగూలీ-ఫ్లింటాఫ్‍ను తలపించిన పాక్, ఆఫ్ఘన్ క్రికెటర్ల వార్

ILT20: షర్ట్ విప్పి గిర్రున తిప్పాడు: గంగూలీ-ఫ్లింటాఫ్‍ను తలపించిన పాక్, ఆఫ్ఘన్ క్రికెటర్ల వార్

ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఆసక్తికరమైన వార్ చోటు చేసుకుంది. దుబాయ్ క్యాపిటల్స్, డెసర్ట్ వైపర్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో   పాక్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్, ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ గుల్బాదిన్ నాయిబ్ మధ్య వార్ గంగూలీ, ఫ్లింటాఫ్ లను గుర్తు చేసింది. 192 పరుగుల లక్ష్య ఛేదనలో దుబాయ్ క్యాపిటల్స్ 16 పరుగుల వద్ద నాయిబ్ ఔటయ్యాడు. అమీర్ వేసిన అద్భుతమైన యార్కర్ కు క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో 5 పరుగులకే ఈ ఆఫ్ఘన్ ఆల్ రౌండర్ ఔట్ కాగా.. జట్టు 16 పరుగుల వద్ద రెండో వికెట్ కు కోల్పోయింది. నాయబ్ ను ఔట్ చేసిన అనంతరం పట్టరాని సంతోషంతో అమీర్ సెలెబ్రేషన్ చేసుకున్నాడు. 

ఔటైన వెంటనే అమీర్ తన కండలను చూపిస్తూ పెవిలియన్ కు వెళ్ళమని నాయిబ్ కు సైగ చేశాడు. చివర్లో సికిందర్ రాజా ఫోర్ కొట్టి దుబాయ్ క్యాపిటల్స్ ను గెలిపించడంతో..నాయిబ్ డ్రెస్సింగ్ రూమ్ దగ్గర తన చొక్కాను తిప్పుతూ విసిరేసి అమీర్ కు కౌంటర్ విసిరాడు. అమీర్ డెసర్ట్ వైపర్స్ తరపున ఆడుతుండగా.. నబీ దుబాయ్ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ వార్ 2002లో జరిగిన నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్ ను తలపించింది. టీమిండియా వికెట్ పడిన తర్వాత ఫ్లింటాఫ్ గ్రౌండ్ లోనే తన షర్ట్ విప్పి సెలెబ్రేషన్ చేసుకున్నాడు. 

ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ ఫైనల్లో భారత్ గెలవడంతో లార్డ్స్ బాల్కనీలో గంగూలీ తన షర్ట్ విప్పి ఫ్లింటాఫ్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఈ ఫైనల్ విషయానికి వస్తే.. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 విజేతగా దుబాయ్ క్యాపిటల్స్ నిలిచింది. ఫైనల్లో డెసర్ట్ వైపర్స్ పై నాలుగు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో దుబాయ్ క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది.

ALSO READ | వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-లో ఇషాకు రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

దుబాయ్ క్యాపిటల్స్ కు ఇదే తొలి ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టైటిల్. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్స్ దుబాయ్ క్యాపియల్స్ ఫ్రాంచైజీ కావడం విశేషం. 192 పరుగుల లక్ష్య ఛేదనలో దుబాయ్ క్యాపిటల్స్ ఒకదశలో 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో వైపర్స్ విజయం ఖాయమనుకున్నారంతా. ఈ దశలో పావెల్(63), హోప్ (43) ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లి మ్యాచ్ పై ఆశలు రేకెత్తించారు. వీరిద్దరూ ఔటైనా చివర్లో సికిందర్ రాజా 12 బంతుల్లోనే 34 పరుగులుచేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకముందు డెసర్ట్ వైపర్స్ ఇన్నింగ్స్ లో హోల్డెన్ (76), సామ్ కరణ్ (62) హాఫ్ సెంచరీలు చేసి జట్టులకు భారీ స్కోర్ అందించారు.