నిజమైన కులగణన చేసి మాలలకు మాదిగలకు న్యాయం చేయాలి: గుమ్మడి కుమారస్వామి

పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న గుమ్మడి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమైన కులగణన చేసి మాల మాదిగలకు న్యాయం చేయాలని అన్నారు.. మాలలు మాల ఉప కులాలపై మాదిగలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. ఎంపీ ఎన్నికల సమయంలో మాల కులానికి చెందిన గడ్డం వంశీకి టికెట్ ఇవ్వద్దని మాదిగలు అడ్డుకున్నారని అన్నారు.  

ALSO READ | ఎస్సీ వర్గీకరణ తీర్పును పునః సమీక్షించాలి : పిల్లి సుధాకర్

సుల్తానాబాద్ ప్రాంతంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పై మాదిగలు అనిచిత వ్యాఖ్యలు చేశారని.. సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడడం సరికాదని హితవు పలికారు గుమ్మడి కుమారస్వామి.మాలలను మాదిగ సోదరులు శత్రువులుగా భావిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే విధంగా మాదిగలలు ప్రవర్తించాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 1న హైదరాబాదులో జరిగే మాలల సింహ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు గుమ్మడి కుమారస్వామి.