ఎడపల్లి రైల్వేస్టేషన్​ పునరుద్ధరించాలని దీక్ష

ఎడపల్లి, వెలుగు: ఎడపల్లి రైల్వే స్టేషన్​ను పునరుద్ధరించాలని కోరుతూ సోమవారం అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో  ఒక రోజు దీక్ష చేపట్టారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ స్టేషన్ ​పునరుద్ధరించాలని ఎన్నిసార్లు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. 

స్టేషన్​ ఎత్తేయడం వల్ల ఎడపల్లితో పాటు చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణ్​పల్లి, అంబం, మంగలపాడ్, వడ్డేపల్లి, ధర్మారం, కుర్నాపల్లి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీక్షలో షేక్ నసీర్, శ్రీపతి మల్లేశ్,  రవి, నారాయణ, సిద్ధ పోశెట్టి, వైద్యనాథ్, ఎర్రన్న పాల్గొన్నారు.