అదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. సినిమా స్టోరీని తలపించే విధంగా ఉంది. ఓ యువతి, ఇద్దరు యువకులు కాలేజీలో చదువుతున్నారు. యువకులిద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఆ అమ్మాయి మాత్రం ఒక అబ్బాయిని ఇష్టపడింది. అదినచ్చని మరో అబ్బాయి వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన యూపీలోని జరిగింది.
కృతికా త్రిపాఠీ, హుక్మేంద్ర గుర్జార్, మరియు మంథన్ సింగ్ సెంగర్ ముగ్గురూ బుందేల్‌ఖండ్‌లోని ఓ కాలేజీలో పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. వీరిమధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. కృతికా త్రిపాఠీ, హుక్మేంద్ర గుర్జార్‌లు సన్నిహితంగా మెలుగుతుండటంతో అది నచ్చని మంథన్ సింగ్ వారిపై కోపం పెంచుకున్నాడు. తనను కాదని వేరేవ్యక్తిని ప్రేమిస్తుండటం నచ్చని మంథన్ వారిపై కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. అందులో భాగంగా శుక్రవారం క్లాస్ రూంకి వచ్చిన మంథన్.. బ్లాక్ బోర్డు మీద హర్ట్ షేప్ డయాగ్రాం గీశాడు. అందులో మంథన్ ఫినిష్ అని రాశాడు. ఆ తర్వాత గుర్జార్ మీద కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో బుల్లెట్ గుర్జార్ తల వెనుకవైపు తగిలింది. దాంతో గుర్జార్ ఓ మెడికల్ కాలేజీ ఆస్సత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయిన మంథన్.. చాణక్యార్పురిలో ఉంటున్న యువతి ఇంటికి వెళ్లి ఆమెపై కాల్పులు జరిపి ఆమెను హతమార్చాడు. తోటివిద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఝాన్సీ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ దినేష్ కుమార్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతని నుంచి దేశీ పిస్టల్‌ను, కార్టిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. మంథన్ సింగ్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఆయన అన్నారు. ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ అధికారులను ఆదేశించారు.
For More News..
కాంగ్రెస్ పార్టీకి కూన శ్రీశైలం గౌడ్ రాజీనామా.. త్వరలో బీజేపీలోకి..
విమానం ఇంజిన్‌లో మంటలు.. వీడియో తీసి పోస్ట్ చేసిన ప్రయాణికుడు
టీమిండియాలోకి ముగ్గురు కొత్తోళ్లు..