
శ్రీకాళహస్తి గుడి మహాద్వారం వద్ద ఘటన..
తిరుపతి: శ్రీకాళహస్తి మహాద్వారం వద్ద కానిస్టేబుల్ గన్ మిస్‌ఫైర్ అయింది. గన్ లాక్ చేస్తుండగా ఒక్కసారిగా గన్ పేలింది. దీంతో ఏఆర్ కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బుల్లెట్ దూసుకెళ్లి స్లాబ్‌ను తాకడంతో తప్పిన ప్రమాదం తప్పింది. ఆలయంలో స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటనపై ఈవో స్పందించారు. ఆలయ సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. విచారణ చేపట్టారు. గాయపడిన కానిస్టేబుల్ కు చికిత్స అందించారు.