హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో తుపాకుల అమ్మకం కలకలం రేపాయి. గన్స్ విక్రయిస్తోన్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గన్స్ విక్రయిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అనుమానస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెలుగు చూసిందని పేర్కొన్నారు.
నిందితుల నుంచి రెండు తుపాకులతో పాటు ఒక తపంచ, 10 బుల్లెట్లు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. గన్స్ అమ్ముతోన్న ముఠాను బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించామని చెప్పారు. ఈ ముఠాలోని కీలక సూత్రధారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. గన్స్ కోసం హైదరాబాద్‌లో ఎవరైనా ఈ ముఠాని సంప్రదించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎవరికైనా గన్స్ విక్రయించారాఅని ఆరా తీస్తున్నామని తెలిపారు.
ALSO READ | నెలాఖరు వరకే KF బీర్లు.. ఆ తర్వాత మందుప్రియులకు దబిడి దిబిడే
ఈ కేసులో ప్రధాన నిందితుడు సంపత్ యాదవ్ పరారీలో ఉండగా అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో తుపాకుల అమ్మకం సంచలనంగా మారింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గన్స్ కోసం ముఠాకు ఆర్డర్ ఇచ్చింది ఎవరనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.