కాంగ్రెస్ లో చేరిన బ్రహ్మారెడ్డి

మఠంపల్లి, వెలుగు : మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గుండా బ్రహ్మారెడ్డి తన అనుచరులతో కలిసి శుక్రవారం హైదరాబాద్​లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

నల్గొండ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అనుచరుడిగా బ్రహ్మారెడ్డి అన్ని వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సైదిరెడ్డి ఓటమి చెందిన తర్వాత పార్టీ వ్యవహారాలకు బ్రహ్మారెడ్డి దూరంగా ఉన్నారు. ​