నారాయణపేట, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వంఅండతోనే ఎంఐఎం గుండాలు దళితులపై దాడులు చేస్తున్నారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కన్వీనర్ ఎస్.విజయ్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాసులు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట గురువారం ఎంఐఎం గుండాల దిష్టి బొమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు కలిసి దళితులపై దాడులు చేస్తున్నారని, ప్రాణాలు తీస్తూ భూములు, ఆస్తులను లాక్కుంటున్నారని ఆరోపించారు. టి.ఆశప్ప, కృష్ణ, లక్ష్మణ్, రఘురామయ్య గౌడ్, రమేశ్, నర్సింలు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ టౌన్: సోలంకి విజయ్ ఆత్మహత్యను నిరసిస్తూ బీజేపీ దళితమోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా దళిత మోర్చా జిల్లా నాయకుడు కృష్ణయ్య మాట్లాడుతూ దళితులపై బీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దళితులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నర్సింలు, రామకృష్ణ, రాములు పాల్గొన్నారు.
ఊట్కూర్: దళితులపై బీఆర్ఎస్, ఎంఐఎం దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్ గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. భరత్, కృష్ణయ్య గౌడ్, కురువ ఆశప్ప, దొబ్బలి హనుమంతు, కొక్కు మల్లేశ్, రమేశ్ పాల్గొన్నారు.