
ముషీరాబాద్, వెలుగు: జై భీమ్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గుండె రమేశ్చంద్ర ఎన్నికయ్యారు. సోమవారం ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆర్గనైజేషన్జాతీయ అధ్యక్షుడు గుండాల కిరణ్ కుమార్ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం రమేశ్చంద్రను రాష్ట్ర అధ్యక్షుడిగా, కో-ఆర్డినేటర్ గా ముని రవీంద్రను, మహిళా ఇన్చార్జ్ గా మాండవ పద్మను నియమించారు.
రమేశ్చంద్ర మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామోదర్ నాయుడు, రాజేశ్, కర్ణం కిషన్, చేవూరి రాజు, రమేశ్, గిరి, లాలు, దుర్గ, నర్సింహులు, కమలాకర్, మల్లికార్జున్, మహేశ్, పెద్దయ్య, నరసింహ, బాలు, బద్రి తదితరులు పాల్గొన్నారు.