జర్నలిస్టు సమస్యలపై పోరాడుతాం : గుండ్రాతి మధు గౌడ్

జర్నలిస్టు సమస్యలపై పోరాడుతాం : గుండ్రాతి మధు గౌడ్

పెబ్బేరు, వెలుగు: జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని టీయూడబ్ల్యూజే(ఐజేయూ అనుబంధం) రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్​ తెలిపారు. ఆదివారం పట్టణంలో పెబ్బేరు, శ్రీరంగాపూర్​ మండల జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని  ఆయన ప్రారంభించారు. విలేకరుల సమస్యలు అడిగి తెలుసుకొన వాటి పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మధు గౌడ్​ మాట్లాడుతూ.. విద్య, వైద్యం, అక్రిడిటేషన్​ కార్డులు, ఇండ్ల స్థలాల కోసం కొట్లాడి ఇప్పించిన ఏకైక యూనియన్  టీయూడబ్ల్యూజే అని చెప్పారు.

రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్, యూనియన్​ నాయకులతో చర్చించి జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్  కార్డులు వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని, ఇప్పుడు వచ్చే కార్డుతో 3 రకాల ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. ఊషన్న, బాలస్వామి, పోలిశెట్టి బాలకృష్ణ, పౌర్ణా రెడ్డి, ప్రశాంత్​, మాధవరావు, రమేశ్​​శెట్టి, శ్రీనివాస్​, బాలరాజు, కిరణ్​ కుమార్​ గౌడ్, రాజేంద్రప్రసాద్, గోపాలకృష్ణ, వేణు సాగర్, వెంకటేశ్​​గౌడ్, కిట్టు శర్మ, నరేశ్  పాల్గొన్నారు.