పీఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్​గా లక్ష్మణ్

పీఆర్టీయూ  స్టేట్ ప్రెసిడెంట్​గా లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: ప్రొగ్రెసీవ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ టీఎస్ (పీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడిగా గుండు లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో సంఘం  జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మన్​ను స్టేట్ ప్రెసిడెంట్​గా ఎన్నుకున్నారు. 

గతంలో ఆయన పీఆర్టీయూ స్టేట్ జనరల్ సెక్రటరీగా, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ సందర్భంగా గుండు లక్ష్మణ్ మాట్లాడుతూ.. టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తనకు ఈ అవకాశం కల్పించిన నాయకత్వానికి ధన్యవాదాలు చెప్పారు.