వరంగల్ మేయర్‌గా గుండు సుధారాణి

వరంగల్ మేయర్‌గా గుండు సుధారాణి

వరంగల్ మున్సిపల్ ఎన్నికలు ఏప్రిల్ 30న జరిగాయి. వాటి ఫలితాలు మే 3న విడుదలయ్యాయి. వాటిలో ఎక్కువ సీట్లు అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. దాంతో మేయర్ పదవి టీఆర్ఎస్ అభ్యర్థికే దక్కింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా.. 29వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందిన గుండు సుధారాణి మేయర్‌గా ఎన్నికయ్యారు. అదేవిధంగా 36వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన రిజ్వానా షమీమ్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. అధిష్టానం నిర్ణయం మేరకు సీల్డ్ కవర్‌లో ఉన్న వీరిద్దరి పేర్లను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావులు అధికారికంగా ప్రకటించారు.