11 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం : గుండు సుధారాణి

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: గ్రేటర్ వరంగల్ సిటీ పరిధిలో 11 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని బల్దియా మేయర్ గుండు సుధారాణి, పరకాల ఎమ్మెల్యే రేపూరి ప్రకాశ్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ కలెక్టర్ సత్యా శారదాదేవి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, బల్దియా కమిషనర్​ అశ్విని తానాజీ వాకడే అన్నారు. 

శుక్రవారం గ్రేటర్ పరిధిలోని రెడ్డిపాలెంలో, వడ్డెపల్లిలో వారు మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు, ప్రజలు తదితరులున్నారు.