గన్నేరువరంలో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ

  •   కాంగ్రెస్ లో చేరిన మండల ప్రజాప్రతినిధులు

గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరం మండలంలో బీఆర్ఎస్​పార్టీకి  ఎదురుదెబ్బ తగిలింది. మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, లీడర్లు సుమారు 100 మంది బుధవారం హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. గన్నేరువరం ఎంపీటీసీ బొడ్డు పుష్పలత, మైలారం సర్పంచ్ దుడ్డు రేణుక-, సాంబయ్యపల్లి సర్పంచ్ నరసింహారెడ్డి, చొక్కారావుపల్లి సర్పంచ్ కరుణాకర్‌‌రెడ్డి, కాసింపేట ఉపసర్పంచ్ సంపత్ రెడ్డి, మాజీ ఎంపీపీ తిరుపతి, మాజీ ఉపసర్పంచ్ మల్లేశం, అంబేద్కర్ సంఘం నాయకులు నేత కిషన్ లతో పాటు సుమారు 100 మంది కాంగ్రెస్‌లో చేరారు. వీరికి రేవంత్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరి వెంట డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, మండలాధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి, లీడర్లు శ్రీనాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.