అమెరికా ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి చోటు చేసుకుంది. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ట్రంప్ కు స్వల్ప గాయాలయ్యాయి. కాల్పులతో అపరమత్తమైన భద్రతా సిబ్బంది హుటాహుటిన ట్రంప్ ను ఆసుపత్రికి తరలించారు. బుల్లెట్ చెవికి తాకటంతో ట్రంప్ చెవి భాగాన గాయమైంది.
#WATCH | Gunfire at Donald Trump's rally in Butler, Pennsylvania (USA). He was escorted to a vehicle by the US Secret Service
— ANI (@ANI) July 13, 2024
"The former President is safe and further information will be released when available' says the US Secret Service.
(Source - Reuters) pic.twitter.com/289Z7ZzxpX
ఈ ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, దుండగుడిని భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. కాల్పుల అనంతరం స్టేజ్ దిగే సమయంలో పిడికిలి చూపిస్తూ అధైర్య పడద్దంటూ సంకేతాలిచ్చారు ట్రంప్.