ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు పెద్దగట్టు జాతర

    విద్యుత్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి

సూర్యాపేట, వెలుగు : పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృ-షి చేస్తోందని విద్యుత్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. సోమవారం స్థానికంగా జరిగిన పెద్దగట్టు పాలకవర్గ ప్రమాణస్వీకారానికి మంత్రి హాజరై మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఆలయాలకు పెద్దపీట వేస్తోందన్నారు. పెద్దగట్టు అభివృద్ధి, శాశ్వత నిర్మాణాల కోసం గతంలో రూ. 7 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.

గత పాలకులు పెద్ద గట్టు జాతరను ఓట్ల కోసం వాడుకున్నారే తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. రూ. 2 కోట్లతో నిర్మించబోయే యాదవ భవన నిర్మాణానికి పెద్దగట్టు పరిసరాల్లోనే భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కమ్యూనిటీ హాల్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, పెద్దగట్టు ఆలయ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కోడి సైదులుయాదవ్, గ్రంథాలయ చైర్మన్‌‌‌‌‌‌‌‌ నిమ్మల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ అన్నపూర్ణ, వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పుట్ట కిశోర్‌‌‌‌‌‌‌‌, కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌ జాటోతు లక్ష్మి పాల్గొన్నారు.

పెద్దగట్టు జాతర పోస్టర్‌‌‌‌‌‌‌‌ ఆవిష్కరణ 

ఫిబ్రవరిలో జరగబోయే పెద్దగట్టు జాతర తేదీలను సోమవారం ఆలయ అర్చకులు ప్రకటించారు. ఈ సందర్బంగా జాతరకు సంబంధించిన పోస్టర్‌‌‌‌‌‌‌‌ను సోమవారం కమిటీ సభ్యులతో కలిసి మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆవిష్కరించారు. జనవరి 22న దిష్టిపూజ నిర్వహించి, ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జాతర నిర్వహించనున్నారు. 5న కేసారం నుంచి దేవరపెట్టె తీసుకురావడం, గంపల ప్రదక్షిణ, 6న బోనాలు, 7 చంద్రపట్నం, 8 నెలవారం నిర్వహించి దేవరపెట్టెను తిరిగి కేసారం తీసుకెళ్లనున్నారు. 9న మకరణతోరణం ఊరేగింపుతో పెద్దగట్టు జాతర ముగియనుంది.

కమ్మరి, శాలివాహనులకు ఆధునిక యంత్రాలు

కమ్మరి శాలివాహనులకు 80 శాతం సబ్సిడీతో ఆధునిక యంత్రాలు అందజేస్తున్నట్లు మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. బీసీ అభివృ-ద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం క్యాప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో మెషీన్లను పంపిణీ చేసి మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో 8 మెషీన్లను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. అన్ని వర్గాల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.