నల్గొండ, వెలుగు : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంట్లకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలాగైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. .
కానీ గ్రాడ్యుయేట్లు కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, పోలీస్ రాజ్యమే నడుస్తోందని విమర్శించారు. పోలీసులు నిష్పక్షపాతంగా నడుచుకోవాలని సూచించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నాయకులు అభిమన్యు శ్రీనివాస్, రావుల శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.