పోసానికి మరోసారి బెయిల్..ఈసారైనా జైలు నుంచి రిలీజ్ అవుతాడా..?

పోసానికి మరోసారి బెయిల్..ఈసారైనా జైలు నుంచి రిలీజ్ అవుతాడా..?

టాలీవుడ్ ప్రముఖ నటుడు, రైటర్ పోసాని కృష్ణ మురళి కి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇప్పటికే పోసానికి  బెయిల్ వచ్చినా సీఐడీ పీటీ వారెంట్ తో జైలులోనే అరెస్ట్ చేసి చేసిన కోర్టు.. నెల రోజులుగా నటుడు పోసాని కృష్ణ మురళి నరసారావు జైల్లో రిమాండులో ఉన్నాడు. దీంతో తన ఆరోగ్య సమస్యల కారణాలని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. శుక్రవారం గుంటూరు కోర్టు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటీషన్ ని పరిశీలించి బెయిల్ మంజూరు చేసింది. 

ALSO READ | దేశంలో సగం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు : 79 శాతంతో ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు టాప్

అయితే నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు గత నెల 27న అరెస్టు చేశారు. రాయదుర్గంలోని మై హోమ్ భుజ అపార్ట్ మెంట్ లోని ఉంటున్న పోసానిని.. బుధవారం రాత్రి ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను ఏపీకి తరలించారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో  టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ లపై పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురం, నరసరావుపేట, చిత్తూరు, తిరుపతి, కృష్ణ, పశ్చిమగోదావరి, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పోసానిని పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు.