
గుంటూరు: గుంటూరు కోర్టులో సినీ నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళి తరపున వాదనలు ముగిశాయి. జడ్జి సమక్షంలో పోసాని కృష్ణ మురళి కన్నీరు పెట్టుకున్నారు. తప్పు చేస్తే నరికేయండని పోసాని భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, రెండు ఆపరేషన్లు, స్టంట్లు వేశారని జడ్జికి వివరించారు.
రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని పోసాని గుంటూరు కోర్టులో జడ్జి ముందు వాపోయారు. ఇరు వైపుల వాదనలు విన్న అనంతరం.. పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. రిమాండ్ విధించడంతో పోలీసులు పోసానిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
ALSO READ | రిలీజ్ టైంలో పోసానికి బిగ్ షాక్ : సీఐడీ కేసులో 14 రోజుల రిమాండ్
ఇదిలా ఉండగా.. సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ను కొట్టేయాలని పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఆదోనిలో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరైంది. అయితే.. గుంటూరు కోర్టు రిమాండ్ విధించడంతో పోసాని గుంటూరు జైలులోనే 14 రోజులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు పోసానిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.