అమెరికాలో రోడ్డు ప్రమాదం..గుంటూరు యువతి మృతి

 అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన యువతి మృతి చెందింది. జూలై 21న  ఒక్లహామాలోని నేషనల్ హైవేపై మూడు కార్లు ఢీ కొనడంతో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జెట్టి హారిక అనే విద్యార్థిని మృతి చెందింది.  ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 వెటర్నరీలో ఎంఎస్ చేయడానికి హారిక 2023 ఆగస్టులో అమెరికా వెళ్లారు.  ఇవాళ రోడ్డు ప్రమాదంలో  హారిక చనిపోయిందన్న విషయం తెలవగానే  కుటుంబ సభ్యులు కన్నీరువుమన్నీరవుతున్నారు.  హారిక మృతదేహాన్ని ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు.