థియేటర్స్ లో సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. ఈరోజు(జనవరి 12) టాలీవుడ్ నుండి రెండు బడా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం(Gunturu kaaram) ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దీంతో రెండు రోజుల ముందు నుండే థియేటర్స్ దగ్గర సందడి మొదలుపెట్టేశారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఈరోజు ఆ రచ్చ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. కటౌట్స్ కడుతూ, పూలదండలు వేస్తూ, బాణా సంచా పేలుస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఇదంతా ప్రతీ సినిమాకు మాములుగా ఉండేదే కానీ, గుంటూరు కారం సినిమాకు ఆ మాస్ సెలెబ్రేషన్స్ నెక్స్ట్ లెవల్ తీసుకెళ్లారు మహేష్ ఫ్యాన్స్. థియేటర్ ముందు మహేష్ ఫోటోను పెట్టి కొబ్బరికాయలు కొట్టు స్థలం అని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో చుసిన నెటిజన్స్ కాస్త అవాక్కవుతున్నారు. ఇదేం క్రేజ్ రా నాయనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరేమో.. ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేయాలంటే బాబు తరువాతే ఎవరైనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక గుంటూరు కారం సినిమా రిజల్ట్ విషయానికి వస్తే.. జనవరి 12 ఒంటిగంట నుండే ప్రీమియర్ షోస్ పడ్డాయి. దీంతో గుంటూరు కారం చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. మహేష్ ఫ్యాన్స్ సినిమా చూసి ఊగిపోతుంటే.. నార్మల్ ఆడియన్స్ మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారు. మరి ఓవరాల్ గా సినిమాకు ఎలాంటి రిజల్ట్ రానుందో చూడాలి.