స్నాక్స్ అంటూ.. కౌన్సిలర్లకే బూజుపట్టిన జీడిపప్పు పెట్టారు..

 స్నాక్స్ అంటూ.. కౌన్సిలర్లకే బూజుపట్టిన జీడిపప్పు పెట్టారు..

జనం సమస్యలపై.. జనం సమస్యలపై చర్చించటానికి ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశంలోనే కౌన్సెలర్లు అవాక్కయ్యారు.. స్నాక్స్ అంటూ బూజుపట్టిన జీడిపప్పు ప్లేట్లు ఇచ్చారు.. అవాక్కయిన కౌన్సిలర్లు.. మాకే ఇలా పెడితే.. ఇక జనానికి ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో అంటూ నోరెళ్లబెట్టారు. ఏపీ రాష్ట్రం గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ అయ్యింది.

 సాధారణంగా కౌన్సిల్​ సమావేశాలు జరిగేటప్పుడు శ్నాక్స్​.. టీ  పానీయం వంటివి అధికారులు మీటింగ్​ కు వచ్చిన ప్రజా ప్రతినిథులకు ఇస్తుంటారు.  అయితే గుంటూరు..మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో విచిత్ర ఘటన నెలకొంది. శ్నాక్స్​పేరుతో జీడిపప్పు బద్దలు ఇచ్చారు.  ఇక అంతే వాటిని చూసిన ప్రజాప్రతినిథులు అవాక్కయ్యారు.  ఇంత ఖరీదైన ఫుడ్​ పెడుతున్నారని అవాక్కయ్యారని అనుకుంటున్నారా... అయితే మీరు బోల్తా పడ్డట్టే..  

సమావేశంలో సర్వ్​ చేసిన జీడిపప్పుడు బూజు వేలాడుతుంది. ప్రజా సమస్యలపై పోరాడే తమకే ఇలాంటి ఫుడ్​ పెడుతున్నారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని  చర్చించుకుంటున్నారు.  నాశిరకం.. బూజుతో ఉన్న జీడిపప్పును సమావేశంలో కార్పరేటర్లకు సర్వ్​ చేయడంపై కార్పొరేటర్​ బాలాజీ మేయర్​.. మున్సిపల్​ కమిషనర్​ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై స్పందించిన కమిషనర్​ పులి శ్రీనివాసరావు.. విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.