
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను అరెస్ట్ చేశారు గుంటూరు పోలీసులు. వైఎస్ జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ ను గురువారం ( ఏప్రిల్ 10 ) అరెస్ట్ చేసిన పోలీసులు ఎస్పీ ఆఫీసుకు తరలిస్తుండగా.. గోరంట్ల మాధవ్ పోలీసు వాహనాలను వెంబడించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారని.. విచారణ అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గోరంట్ల మాధవ్ తన వాహనంలో వచ్చి ఎస్కార్ట్ వాహనాలను వెంబడించారని.. అంతే కాకుండా వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు పోలీసులు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం.