గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్​

గుంటూరు రాయపాటి వీరయ్య చౌదరి ప్రాథమిక పాఠశాల బూతులో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.  టీడీపీకి చెందిన కొంతమంది కార్యకర్తలు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించారు.  సమాచారం అందుకున్న వైసీపీ అభ్యర్థి విడుదల రజని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి  వారిని అడ్డుకన్నారు.  దీంతో టీడీపీ కార్యకర్తలు వారిపై దూషణకు దిగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.  సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితి శాంతిపరిచేందుకు స్వల్పంగా లాఠీ చార్జ్​ చేసి ఇరు వర్గాలను తరిమేశారు.