viral video : కాస్ట్లీ కారు ఖతం.. BMW కారు వరదలో మునిగిపోయింది

viral video : కాస్ట్లీ కారు ఖతం.. BMW కారు వరదలో మునిగిపోయింది

దేశవ్యాప్తంగా రెండుమూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నారు. వర్షాల కారణంగా నగరాల్లో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. హర్యానాలోని గురుగ్రామ్ పట్టణంలో రూ.83 లక్షల BMW  M340i మోడల్ కారు పూర్తిగా నీటిలో ముగినిపోయింది. దీంతో బాధితుడు సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. గురుగ్రామ్ లో ఓ వ్యక్తి అతని ఇంటి ముందు ఓ లగ్జీరీ BMW కారు పార్కింగ్ చేశాడు.

గురువారం కురిసిన భారీ వర్షాలకు అక్కడ వరద నీరు చేరింది. ఖరీదైన కారు వరదలో చిక్కుకుపోయింది. అంతా అయిపోయింది.. ఛీ,  నేను ట్యాక్స్ పే చేస్తున్నా, అయినా నాకు మౌలిక సదుపాయాలు ఎందుకు ప్రభుత్వం కల్పించట్లే అని ఇన్స్టాగ్రామ్ లో ప్రశ్నించాడు. పాక్షింగా ఫ్లాడ్స్ తో మునిగిపోయిన కారు ఫొటో పోస్ట్ చేసి ఈ  సమస్యను పరిష్కరించడానికి ఇంకా అధికారులు ఎవరూ రాలేదని వాపోతున్నాడు.

ఇది మారుమూల ప్రాంతం కాదు. ఓ మెట్రో టౌన్ అయినప్పటికీ ఇలా జరగడం చాలా భాదగా ఉందని అధికారులను ట్యాగ్ చేశాడు. సిటీ ఫెసిలిటీస్ ఏ మాత్రం సరిగా లేవని ప్రభుత్వం పైర్ అయ్యాడు. అతని పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది. నెటిజన్లు కాంమెట్స్ తో రియాక్ట్ అవుతున్నారు.