రంజీ ట్రోఫీలో తమిళ నాడు పేసర్ గుర్జప్నీత్ సింగ్ రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. శ్రీరామకృష్ణ కళాశాల మైదానంలో సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్లతో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్ లో వికెట్లు తీయకపోయినా.. రెండో ఇన్నింగ్స్ లో మొత్తం 14 ఓవర్లు వేసి కేవలం 22 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు తీయడం విశేషం. అంతేకాదు టీమిండియా స్టార్ బ్యాటర్ పుజారాను డకౌట్ చేశాడు. ఈ ఫాస్ట్ బౌలర్ ధాటికి సౌరాష్ట్ర తమ రెండో ఇన్నింగ్స్ లో 94 పరుగులకే కుప్పకూలింది.
ఒక్క మ్యాచ్ తో టాప్ బౌలింగ్ తో అదరగొట్టిన ఈ పేసర్ తన సీక్రెట్ ను బయటపెట్టాడు. విరాట్ కోహ్లీకి తాను బౌలింగ్ చేయడం వలనే తనకు చాలా మెళకువలు తెలిశాయని అన్నాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ కు ముందు నెట్స్ లో గుర్జప్నీత్ సింగ్ కోహ్లీకి బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో తనకు కోహ్లీ విలువైన సలహాలు ఇచ్చాడని.. ఈ టిప్స్ తోనే తన బౌలింగ్ మెరుగుపడిందని మ్యాచ్ అనంతరం తెలిపాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 203 పరుగులకే ఆలౌటైంది. ఆర్పత్ వాసవాడ 62 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సాయి కిషోర్, సోనూ యాదవ్, మహమ్మద్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన తమిళ నాడు జగదీశన్ సెంచరీతో 367 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో తమిళ నాడుకు 164 పరుగుల ఆధిక్యం వచ్చింది. రెండో ఇన్నింగ్స్ లో సౌరాష్ట్ర 94 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇన్నింగ్స్ 67 పరుగుల తేడాతో తమిళ నాడు ఘన విజయం సాధించింది.
Lovely picture. Tamil Nadu's left arm pacer Gurjapneet Singh and Virat Kohli. pic.twitter.com/VoNqvt3Myo
— Kaushik Kashyap (@CricKaushik_) September 18, 2024