దేవరకొండ, వెలుగు: నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి రమావత్ రవీంద్ర కుమార్కు నేరేడుగొమ్ము మండలం గుర్రపు తండాలో నిరసన సెగ తగిలింది. తండాకు వచ్చిన రవీంద్ర కుమార్ ను చూసిన గిరిజనులు ‘ఓట్ల కోసం మళ్లీ మా తండాకు ఎందుకొచ్చినవ్?’ అని ప్రశ్నించారు. ఎక్కడి సమస్యలక్కడే ఉన్నాయని, మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావని పలువురు యువకులు రవీంద్ర కుమార్ వాహనం ఎదుట నిలబడి నిలదీశారు.
తాము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని ఆయన ఎదుటే స్పష్టం చేశారు. స్థానిక నాయకులు సర్ది చెప్పినా వినలేదు. చివరకు పోలీసులు నచ్చజెప్పడంతో శాంతించారు. దీంతో రవీంద్ర కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.