దేశంలో 56వ రిజర్వ్ టైగర్ పారెస్ట్ గా దీన్నే ప్రకటించారు

దేశంలో 56వ రిజర్వ్ టైగర్ పారెస్ట్ గా దీన్నే ప్రకటించారు

doఛత్తీస్​గఢ్​లోని గురు ఘాసిదాస్ తామోర్​ పింగ్లా టైగర్ రిజర్వ్​ను దేశంలోని 56వ టైగర్​ రిజర్వ్​గా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులశాఖ మంత్రి భూపేంద్రయాదవ్​ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు ఛత్తీస్​గఢ్​లో ఇంద్రావతి(బీజాపూర్​), ఉదంతి సీతానది(గరియాబంద్​), అచానక్​ (బిలాస్​పూర్​ జిల్లా)ల్లో మొత్తం మూడు టైగర్ రిజర్వులు మాత్రమే ఉండేవి. 

ఈ గురుఘాసిదాస్ – తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్​గా గుర్తింపుతో ఛత్తీస్​గఢ్​లో నాలుగు టైగర్​ రిజర్వులు ఉన్నాయి. ఈ టైగర్ రిజర్వ్​ 2049.2 చ.కి.మీ. మేరకు విస్తరించి ఉంది. ఇందులో గురు ఘాసిదాస్ నేషనల్​ పార్క్​, టామోర్​ పింగ్లా వన్యప్రాణుల అభయారణ్యం కీలకమైన పులుల ఆవాసాలు ఉన్నాయి. ఈ రిజర్వ్​ 780.15 చ.కి.మీ.ల బఫర్ జోన్​ను కలిగి ఉన్నది.  ఇది ఆంధ్రప్రదేశ్​లోని నాగార్జునసాగర్​ – శ్రీశైలం టైగర్​ రిజర్వ్​(3296), అసోంలోని మానస్ టైగర్​ రిజర్వ్​ (28371.1 చ.కి.మీ.) తర్వాత దేశంలో మూడో అతి పెద్ద టైగర్ రిజర్వ్​గా నిలిచింది.


సంస్థలు స్థాపకులు 
సంస్థ    సం.    స్థాపకులు 
యంగ్​మెన్స్​ ఇంప్రూవ్​మెంట్​ సొసైటీ    1879    అఘోరనాథ చటోపాధ్యాయ
హిందూ సోషల్​ క్లబ్​    1888    రాజా మురళి మనోహర్​
ఆర్యసమాజ్​ హైదరాబాద్​ శాఖ    1892    కమలా ప్రసాద్​, లక్ష్మణ్​ దేశ్​జీ
దివ్యజ్ఞాన సమాజం హైదరాబాద్​ శాఖ    1905-06    -
ఆంధ్ర విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి    1900    కొమర్రాజు లక్ష్మణరావు
జగన్ మిత్ర మండలి    1906    భాగ్యరెడ్డి వర్మ
మన్యం సంఘం    1911    భాగ్యరెడ్డి వర్మ
హ్యూమానిటేరియన్​ లీగ్​    1913    రాయ్ బాలముకుంద్​, లాల్​జీ మేఘ్​జీ
బ్రహ్మ సమాజం మొదటి సమావేశం    1914    నారాయణ గోవింద వెల్లాంకర్​
హైదరాబాద్​ సోషల్​ సర్వీస్​ లీగ్​    1915    వామన్​రావు, కేశవరావు కోరాట్కర్​
హైదరాబాద్​ యువకుల సంఘం    1916    వామన్​రావు నాయక్​
హైదరాబాద్​ ఎడ్యుకేషన్ సొసైటీ    1915    మౌల్వీ మహ్మద్​ ముర్తజా
ఆది హిందూ సోషల్​ సర్వీస్​ లీగ్​    1922    భాగ్యరెడ్డి వర్మ
ఆది హిందూ ద్రవిడ సంఘం    1922    బి.ఎస్​.వెంకట్రావు 
ఆంధ్ర జన సంఘం    1922    కేవీ రంగారెడ్డి